Foxtail Millet Sambar Rice Recipe Making Telugu

0
కొర్ర సాంబారు అన్నం తయారు చేయు విధానము

Foxtail Millet Sambar Rice Recipe Making In Telugu

కావలసినవి: 

కొర్ర బియ్యం – ఒక గ్లాసు
కంది పప్పు – ఒక గ్లాసు
చింతపండు గుజ్జు – 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
కూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బీన్స్, మునగకాడ మొదలైనవి)
నెయ్యి లేదా నూనె – 2 టీ స్పూన్లు
కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు
బిసిబేళబాత్‌ మసాలా – 2 టీ స్పూన్లు
పోపు కోసంఆవాలు – ఒక టీ స్పూను
కరివేపాకు – 2 రెమ్మలు
ఎండు మిర్చి – 2
పచ్చిమిర్చి – 2
జీడిపప్పు – 10
ఇంగువ – పావు టీ స్పూను
ఉల్లి తరుగు – పావు కప్పు

తయారీ:

కొర్ర బియ్యం, కంది పప్పులను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో విడివిడిగా సుమారు మూడు గంటలపాటు నానబెట్టాలి.

కూరగాయ ముక్కలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి.

ఐదుగ్లాసుల నీరు మరగబెట్టాలి. నీళ్లు మరుగుతుండగా కంది పప్పు వేసి మూడు వంతులు ఉడికిన తరవాత, కొర్ర బియ్యం కూడా చేర్చి మెత్తగా ఉడికించాలి.

స్టౌ మీద బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు, జీడిపప్పులు, ఇంగువ వేసి దోరగా వేయించాలి.
కొర్ర సాంబారు అన్నం తయారు చేయు విధానము తెలుగులో
కొర్ర సాంబారు అన్నం తయారు చేయు విధానము తెలుగులో

చింత పండు గుజ్జు, ఉప్పు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి.

బిసిబేళబాత్‌ మసాలా వేసి కలపాలి. మెత్తగా ఉడికించిన కొర్రబియ్యం, కంది పప్పు మిశ్రమాన్ని జత చేసి, మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి.

కొత్తిమీర, నెయ్యి వేసి కలియబెట్టి, అప్పడాలు, కారబ్బూందీ, పిండి వడియాలతో వేడివేడిగా వడ్డించాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?

కొర్రలు (Foxtail Millet)
నియాసిన్‌ l (Niacin)mg (B3)    0.7
రిబోఫ్లావిన్‌(Rivoflavin)mg (B2)     0.11
థయామిన్‌  (Thiamine) mg (B1)    0.59
కెరోటిన్‌ (Carotene)ug        32
ఐరన్‌(Iron)mg        6.3
కాల్షియం (Calcium)g        0.03
ఫాస్పరస్‌(Phosphorous)g    00.29
ప్రొటీన్‌  (Protein)g        12.3
ఖనిజాలు  (Minerals) g        3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g    60.6
పీచు పదార్థం(Fiber) g        8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    7.57.

Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa |  Foxtail Millet Bread | Foxtail Millet  Cabbage Muthia | Foxtail Millet  Halwa | Foxtail Millet  Thipi Pongal | Foxtail Millet  Roti | Foxtail Millet kobbari Annam |

Post a Comment

0Comments
Post a Comment (0)