Breaking

Glamorous Indian models photos latest fashion shoots celebrity images designer outfits runway appearances magazine covers wallpapers and entertainment updates featuring top models and style icons from the Indian fashion industry

Ads

February 27, 2019

little Millet Tomato Pulao Recipe In Telugu

సామల టొమాటో పులావ్‌ తయారు చేయు విధానము తెలుగులో

little Millet Tomato Pulao Recipe Making In Telugu

కావలసినవి:

సామలు – ఒక కప్పు,
నెయ్యి/నూనె – 2 టీ స్పూన్లు
ఉల్లి తరుగు – పావు కప్పు
తరిగిన పచ్చి మిర్చి – రెండు
క్యారట్‌ తరుగు – ఒక టేబుల్‌ స్పూను,
కరివేపాకు – 2 రెమ్మలు
అల్లం తురుము – ఒక టీ స్పూను
ఆవాలు – ఒక టీ స్పూను,
పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను
మినప్పప్పు – ఒక టీ స్పూను
టొమాటో తరుగు – పావు కప్పు,
పసుపు – పావు టీ స్పూను
మిరప కారం – పావు టీ స్పూను,
కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను,
నీళ్లు, ఉప్పు – తగినంత,
ఉడికించిన బఠాణీ – ఒక కప్పు

తయారీ:

సామలకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి.

స్టౌ మీద కుకర్‌ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఉల్లి తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉడికించిన బఠాణీలు, క్యారట్‌ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.

little Millet Tomato Pulao Recipe Making In Telugu
little Millet Tomato Pulao Recipe Making In Telugu

టొమాటో తరుగు, పసుపు, మిరప కారం వేసి మరోమారు కలపాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. సామలలో నీళ్లు ఒంపేయాలి.

మరుగుతున్న నీటిలో సామలు వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి.

కొత్తిమీరతో అలంకరించి, కొబ్బరి చట్నీతో గాని, కొత్తిమీర చట్నీతో గాని వడ్డించాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?

సామలు (Littile Millet)
నియాసిన్‌  (Niacin)mg (B3)    1.5
రిబోఫ్లావిన్‌  (Rivoflavin)mg (B2)     0.07
థయామిన్‌ (Thiamine) mg (B1)    0.30
కెరోటిన్‌(Carotene)ug        0
ఐరన్‌ (Iron)mg        2.8
కాల్షియం (Calcium)g        0.02
ఫాస్పరస్‌ (Phosphorous)g    0.28
ప్రొటీన్‌  (Protein)g        7.7
ఖనిజాలు (Minerals) g        1.5
పిండిపదార్థం (Carbo Hydrate) g    65.5
పీచు పదార్థం  (Fiber) g        9.8
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    6.68.

Little Millet Recipes | Little Millet recipe in Telugu | How to cook millet | Little Millet nutrition | Little Millet Sambar Rice | Little Millet Mango Rice | Little Millet Biscuits | Little Millet Vegetable Biryani | Millet Idli | Little Millet Dosa |  Little Millet Bread | Little Millet  Cabbage Muthia | Little Millet  Halwa | Little Millet  Thipi Pongal | Little Millet  Roti | Little Millet kobbari Annam |


No comments:

Post a Comment