Breaking

Tollywood Bollywood Hollywood Kollywood Telugu Actors Actress Latest Photo Shoot Stills Photos Pictures Movie Posters Gallery Pics Wallpapers Movies List

Ads

April 23, 2019

మంచి నీరు ఎప్పుడు ఎలా త్రాగాలి డాక్టర్ ఖాదర్ వలి సూచనలు

మంచి నీరు ఎప్పుడు ఎలా త్రాగాలి డాక్టర్ ఖాదర్ వలి సూచనలు
How to take Drinking Water Tips By Dr khadar vali

సరిపడ నీరు త్రాగడం అవసరమని డాక్టర్ ఖాదర్ గారు సూచించారు

మన దప్పిక తీర్చుకోడానికి మాత్రమే మంచి నీరు సేవించాలి. ప్రతి దినము మూడు లేక నాలుగు లీటర్ల నీరు త్రాగే అవసరం లేదు.

శరీరిక శ్రమ, చమట పట్టడంల వలన అలసట కలుగుతుంది. అట్టి సమయాలలో మంచినీటిని త్రాగాలి.

కందరికి నిత్యం కాచి చల్లార్చిన నీరు లేక వెచ్చని నీరు త్రాగే అలవాటు ఉంటుంది  ఎందుకంటే అట్టి నీటిలో ఎటువంటి హానికరమైన సూక్ష్మ జీవులు ఉండవు కనుక. అనారోగ్యం గా ఉన్నప్పుడు ఈ పద్ధతి పాటించడం సరైనదే. కానీ ఇలాంటి నీటిని త్రాగటం అలవాటు చేసుకుంటే మన రోగనిరధకశక్తి క్రమంగా క్షీణిస్తుంది.

How to take Drinking Water Tips By Dr khadar vali
How to take Drinking Water Tips By Dr khadar vali

సధారణ వాతావరణ ఉష్ణోగ్రత (room temperature) లో ఉన్న పరిశుభ్ర మైన నీటిని త్రాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఒక రాగి ఫలకాన్ని (3" × 15" పరిమాణం) మంచినీరు నింపిన మట్టి కుండ లోనో లేక స్టీల్ బిందెలోనో ఏడు గంటల పాటు లేక రాత్రంతా ఉంచి రచనాత్మక నీరు (structured water) తయారు చేసుకోవచ్చు. ఈ నీటిని త్రాగడానికి, వంటకు వాడుకోవాలి. ప్లాస్టిక్ యొక్క అతి సూక్ష్మాణువులు(nano particles), ఇతర మలినాల నిర్మూలనలో రాగి ఫలకం సహాయ పడుతుంది.

గమనిక: రాగి ఫలకాన్న ప్రతి రోజూ చింతపండు లేక నిమ్మరసం లో కొద్దిగా ఉప్పు సహాయంతో శుభ్రపరుచుకోవాలి.


No comments:

Post a Comment