Breaking

Tollywood Bollywood Hollywood Kollywood Telugu Actors Actress Latest Photo Shoot Stills Photos Pictures Movie Posters Gallery Pics Wallpapers Movies List

Ads

April 19, 2019

Just Reading in not a preparation for exams

చదవడమొక్కటే ప్రిపరేషన్‍ కాదు

Just Reading in not a preparation for exams

* ఆన్సర్‍ని పర్‍పెక్టుగా రాయడం ముఖ్యం

* పూర్తి మార్కులు పొందాలంటే చేతిరాత బాగుండాలి

* స్టూడెంట్స్ కు హ్యాండ్‍రైటింగ్‍ నిపుణుల సూచనలు

పరీక్షల్లో  చేతి రాతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మంచి దస్తూరితో కనీసం 5నుంచి 10 శాతం మార్కులను అదనంగా పొందే వీలుంది.  త్వరలో  ఇంటర్మీడియట్‌, పదో తరగతి, డిగ్రీ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. కొందరి స్టూడెంట్స్ కి సబ్జెక్టుపై పూర్తిగా పట్టున్న ప్రభావవంతంగా ఎగ్జామీనర్లకు అర్థమయ్యే విధంగా రాయలేరు. దాంతో వారు కొన్ని మార్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో స్టూడెంట్‍ హ్యాండ్ రైటింగ్‍ను బట్టి   అతనికి సబ్జెక్టుపై ఉన్న అవగాహన స్థాయిని కూడా అంచనా వేసే అవకాశం ఉంది.  స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో సాధరణంగా చేసే పొరబాట్లు, వాటి మెరుగుకు పాటించాల్సిన సూచనలను నిపుణులు సూచించారు.

అవి మీ కోసం..

విద్యార్థులు ఎక్కువగా చేసే పొరపాట్లు ఇవీ..

*  ఒక్కో పేజీలో 15 లైన్లకు మించి రాయకపోవడం మేలు.

*  అక్షరాలన్నింటిని ఒకే పరిమాణంలో రాయాలి. కొన్ని చిన్నగా పెద్దగా రాయడం మీ మార్కులను తగ్గించే అవకాశం ఉంది. మొత్తమంతా మీడియం సైజులో ఉండేవిధంగా రాయాలి.

* కొంతమంది తప్పుగా రాసిన ఆన్సర్‍లను అడ్డదిడ్డంగా కొట్టివేస్తారు. అలా చేయడం వల్ల పేపర్‍ మొత్తం దిద్దినట్టు ఉంటుంది. ఒక గీతను రాసిన దానిపై అడ్డంగా గీసి, దానికింద ఆన్సర్‍ రాయడం మొదలు పెడితే చాలు.

* అక్షరాల మధ్య గ్యాప్‍ ఇస్తూ రాస్తుంటారు. ఇలా రాయడం పదాలు, అక్షరాల మధ్య తేడా లేకుండా పోతుంది. అక్షరాల, పదాల మధ్య నిర్ణీత గ్యాప్‍ ఇవ్వాలి.

* ఆన్సర్‍లో కొట్టివేతలు ఎక్కువగా ఉండకండా చూసుకోవాలి. కొట్టివేతలు ఎక్కువైతే మీకు ఆన్సర్‍పై పట్టు లేదని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది.

* ప్లేన్‍ పేపర్‍పై రాసేటప్పుడు కొందరు స్టూడెంట్స్ అక్షరాలను కిందికి మీదికి రాస్తుంటారు.  టాప్‍  మార్జిన్‍ గీతను చూస్తూ రాస్తే మొదటి వరుస కరెక్ట్ గా వస్తుంది. దాంతో మిగతా లైన్లు ఆదే క్రమంలో వస్తాయి.    ప్రాక్టిస్‍ చేస్తే సమస్యను సులువుగా అధిగమించవచ్చు.

* ఒక వరుస కంప్లీట్‍ కాగానే నెక్ట్స్ వరుసలో రాసే టైంలో ఒక పదాన్ని వీడదీసి కింది వరుసలో రాస్తుంటారు. దాంతో వాటి అర్థం మారిపోయే అవకాశం ఉంది.  పదాన్ని విడదీయకుండా మొత్తం పదాన్ని ఒకే వరుసలో వచ్చేట్టు జాగ్రత్త తీసుకోవాలి.

Just Reading in not a preparation for exams
Just Reading in not a preparation for exams

* ఇంగ్లిషు మీడియంలో విద్యార్థులు  స్పెల్లింగ్‍ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఒక అక్షరం మారినా పదాల అర్థం మారిపోతుంది. దాంతో ఆన్సర్‍ తప్పవుతుంది.

* అంకెలను రాయడంలో చాలా మంది విద్యార్థులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.  2  అంకెను ఆంగ్ల అక్షరం జడ్‌ మాదిరిగా, 5 అంకెను ఎస్‌ మాదిరిగా రాయడం వల్ల మార్కులు తగ్గిపోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

* ఆంగ్ల అక్షరం ‘ఐ’పైన చుక్క, ‘జె’ అక్షరం పైన గీతను మరచి పోతుంటారు.  ‘ఐ,జే,పీ’  కలిపి రాసే క్రమంలో ఇతర అక్షరాలతో జాగ్రత్తగా కలపాలి.  తెలుగులో ణ, మ, య తదిత అక్షరాలు సరిగా రాయకుండా నిర్లక్ష్యం చేసి మార్కులను కోల్పోతుంటారు. స అనే అక్షరాన్ని ‘గ’ రూపంలో రాసేవారూ ఉన్నారు.

* సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీసినప్పుడు ఆ చిత్రంలోని భాగాలను కొందరు గుర్తించరు. పేర్లను కూడా గుర్తిస్తే పూర్తి మార్కులను పొందే వీలుంది.

* స్కెచ్‌లు, వివిధ రంగుల పెన్నులు ఎక్కువగా వాడొద్దు. అలా రాస్తే ఆ పేపర్లను  దిద్దే వారికి అసహనం కలిగించే అవకాశం ఉంది. అవసరమైన చోట మాత్రమే ఉపయోగిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది.

*  ప్రతి పేజీకి పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్‌ విడిచి పెట్టాలి.  ఆన్సర్‍ షీట్లను దారంతో కట్టినా ఇవాల్యూయేషన్‍ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మెరుగైన హ్యాండ్‍రైటింగ్‍తో పూర్తి మార్కులు : వై.మల్లికార్జునరావు, డైరక్టర్, నేషనల్ హ్యాండ్‍రైటింగ్‍ అకాడమీ

చదవడంతోపాటు రాయడం కూడా ప్రాక్టిస్‍ చేసినప్పుడే ప్రిపరేషన్‍ పూర్తయినట్లు. పది, ఇంటర్‍ పేపర్లను ఆన్‍లైన్‍లో ఇవాల్యూయేషన్‍ చేయరు కాబట్టి మంచి హ్యాండ్‍ రైటింగ్‍తో సమాధానాలు రాస్తే ఆ క్వశ్చన్‍కు కేటాయించిన పూర్తి మార్కులు పొందే వీలుంది.  అక్షర దోషాలు లేకుండా వేగంగా స్పష్టంగా రాసే విధంగా సాధన చేయాలి. సాధన ద్వారానే హ్యాండ్‍రైటింగ్‍ మెరుగుపడుతుంది. స్టూడెంట్స్  స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి.  సంఖ్యలు, అక్షరాలు, పదాలు రాసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్సర్ షీట్‍ కొట్టివేతలు లేకుండా ఆకర్షణీయంగా ఉండాలి.

No comments:

Post a Comment