Breaking

Glamorous Indian models photos latest fashion shoots celebrity images designer outfits runway appearances magazine covers wallpapers and entertainment updates featuring top models and style icons from the Indian fashion industry

Ads

April 19, 2019

Little millet Daddojanam Recipe Making In Telugu

సామల దద్ధ్యోదనం తయారు చేయు విధానము తెలుగులో

Little millet Daddojanam Recipe Making In Telugu

కావలసినవి:  

సామలు – అర కప్పు, నీళ్లు – 2 కప్పులు పెరుగు – ముప్పావు కప్పు, కొబ్బరి పాలు – పావు కప్పు క్యారట్‌ – 3 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నెయ్యి/నూనె – ఒక టీ స్పూను, ఆవాలు – అర టీ స్పూను మినప్పప్పు – అర టీ స్పూను, కరివేపాకు – 2 రెమ్మలు
తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం తురుము – ఒక టీ స్పూను

తయారీ:

ముందుగా సామలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి.

నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి.

ఉడికిన సామల అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి.

Little Millet Daddojanam Recipe Making In Telugu
Little Millet Daddojanam Recipe Making In Telugu

పెరుగు, కొబ్బరి పాలు జత చేసి కలియబెట్టాలి.

స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె/నెయ్యి వేసి కాగనివ్వాలి.

ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి.

క్యారట్‌ తురుము జత చేసి మరోమారు వేయించి, సామల అన్నంలో వేసి కలియబెట్టాలి. ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి.

కొత్తిమీరతో అలంకరించి, అల్లం చట్నీతో అందించాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?

సామలు (Littile Millet)
నియాసిన్‌  (Niacin)mg (B3)    1.5
రిబోఫ్లావిన్‌  (Rivoflavin)mg (B2)     0.07
థయామిన్‌ (Thiamine) mg (B1)    0.30
కెరోటిన్‌(Carotene)ug        0
ఐరన్‌ (Iron)mg        2.8
కాల్షియం (Calcium)g        0.02
ఫాస్పరస్‌ (Phosphorous)g    0.28
ప్రొటీన్‌  (Protein)g        7.7
ఖనిజాలు (Minerals) g        1.5
పిండిపదార్థం (Carbo Hydrate) g    65.5
పీచు పదార్థం  (Fiber) g        9.8
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    6.68.


Little Millet Recipes | Little Millet recipe in Telugu | How to cook Millet | Little Millet nutrition | Little Millet Sambar Rice | Little Millet Mango Rice | Little Millet Biscuits | Little Millet Vegetable Biryani | Millet Idli | Little Millet Dosa |  Little Millet Bread | Little Millet  Cabbage Muthia | Little Millet  Halwa | Little Millet  Thipi Pongal | Little Millet  Roti | Little Millet kobbari Annam |

No comments:

Post a Comment