Millets Ambali Recipe Making In Telugu

1 minute read
0
సిరిధాన్యాలతో అంబలి తయారీ విధానం
Millets Ambali Recipe Making In Telugu

కావలసిన పదార్థాలు

ఏదైనా ఒక సిరి ధాన్యం -  1 కప్పు
నీళ్లు     -   10 కప్పులు.

 తయారీవిధానం

సిరి ధాన్యం ఒక కప్పు తీసుకొని కడిగి ,మిక్సీ లో నూకలాగా తిప్పుకుని 1 కి 4 నీళ్లు పోసి ఆరు గంటలు నాన పెట్టుకొని ఉంచుకోవాలి.

 ఉదయం చేసుకోవాలి అంటే రాత్రి నానపెట్టుకోవాలి.రాత్రి చేసుకోవాలి అంటే ఉదయం నానపెట్టుకోవాలి.

నాన పెట్టుకున్న సిరి ధాన్యాన్ని సన్నని మంట మీద ఉడికించుకోవాలి,మధ్య మధ్యలో మిలిన నీళ్లు కూడా కలుపుకుంటు ఉడికించుకోవాలి.

ఇలా తయారు చేసుకొన్న దానిపై పలుచని శుభ్రంగా ఉన్న బట్ట కట్టి ఉంచు కొని  ఉదయం చేసుకున్నది రాత్రి, రాత్రి చేసుకొని ఉదయం తినాలి.
తినేముందు ఉప్పు కలుపుకోవాలి.
ఇందులో సాంబార్,పప్పు, కర్రీస్ ,చారు, మజ్జిగ ఇలా ఏవి అయినా వేసుకొని తినొచ్చు.

Millets Ambali Recipe Making In Telugu
Millets Ambali Recipe Making In Telugu

 Note:

1. ఇంట్లో పైన చెప్పిన విధం గా నూకచేసుకొని మాత్రమే చేసుకోండి .బయట కొన్న నూకల తో చేసుకోవద్దు.

2. గంజి, అంబలి చేసుకోవడానికి మట్టి కుండలు శ్రేష్టం.

3. సామలు ,ఊదల కు నీళ్లు కొద్దిగ తక్కువ పడతాయి ,చూసుకొని వేసుకోండి.

4. అన్నిరకాల సిరిధాన్యలతో అంబలి చేసే విధానము ఒక్కటే.

5. అంబలి  లా తీసుకోవాలి అనుకున్నప్పుడు కూరగాయలు, ఆకుకూరలు వేసి ఉడికించుకోరాదు. ఎందు కంటే మనము అంబలిని పులియబెట్టుకొని తింటాము కనుక.

6. అంబలి త్రాగే ముందు, మిరియాలు లేక జీలకర్ర లేక వాము పొడులను కలుపుకుని కూడా తీసుకోవచ్చు.

7. అంబలి తీసుకునే ముందు  వేడి చేసుకోవాలి అంటే వేడినీటి గిన్నెలో అంబలి గిన్నె పెట్టుకొని గోరు వెచ్చగా చేసుకోవచ్చు.

8. వేడిగా ఉన్న పదార్థాలను అంబలిలో వేసుకోరాదు. అలా చేస్తే అంబలిలో మనకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి.


Post a Comment

0Comments
Post a Comment (0)