Sleeping Next to Your Phone Could Seriously Damage Your Health

0
సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకుని పడుకుంటే మీ పని ఫినిష్
Sleeping Next to Your Phone Could Seriously Damage Your Health

ప్రస్తుతం మనిషి జీవితంలో సెల్ ఫోన్ తప్పని సరి అయింది. పడుకున్నా, లేచినా సెల్ ఫోన్ పక్కన ఉండాల్సిందే. కొందరైతే.. బాత్ రూం లో కూడా మొబైల్ ను వాడుతున్నారంటే సెల్ ఫోన్ పైత్యం ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అయితే .. ఇలాగే సెల్ ఫోన్ ను గనుక వాడినట్లయితే మీ జీవితకాలం సగానికి తగ్గిపోవడం ఖాయమని అంటున్నారు శాస్త్రవెేత్తలు.

Sleeping Next to Your Phone Could Seriously Damage Your Health
Sleeping Next to Your Phone Could Seriously Damage Your Health

సెల్ ఫోన్ విడుదల చేసే.. రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వల్ల మనుషులకు బ్రేన్ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది ఎవరో దారినన పోయే దానయ్య చెప్పిన విషయం కాదు.. కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇంతే కాదు.. సెల్ ఫోన్ ను ఎంతవరకు ఎలా వాడితే మంచిదో కూడా తెలిపారు. ఇప్పుడు ఆ విషయాలను చూద్దాం..

ముఖ్యంగా.. పడుకునేప్పుడు సెల్ ఫోన్ ను తల పక్కన, పెట్టుకుని పడుకొవద్దు. రాత్రంతా తల పక్కకే మొబైల్ ఉండటం వల్ల చెవులు సరిగ్గా వినపడక పోవడం, జ్ఞాపక శక్తి మందగించడం, నిద్ర లేమి, స్ర్పెమ్ కౌంట్ పడిపోవడం, నర్వ్ సిస్టమ్ లో ట్యూమర్ రావడంతో పాటు.. బ్రేన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. వీటితో పాటు సిగ్నల్ వీక్ గా ఉన్నప్పుడు మొబైల్ ను వాడొద్దని చెప్తున్నారు. స్ట్రీమింగ్ వీడియోలను, ఆడియోను మొబైల్ లో ఎక్కువ సేపు చూడడంగాని, వినడంగాని చేయొద్దని.. దీని వల్ల రేడియో ఫ్రీక్వెన్సీ శరీరం పై కంటిన్యూగా విడుదలై అనారోగ్యం ఖాయమని అంటున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)